తాడేపల్లి : వెనుకబడిన వర్గాలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ నేత ప్రతాప్ రెడ్డి చేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని మండిపడ్డారు. ప్రతాప్ రెడ్డి వైస్సార్‌సీపీ నేత అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి అనే పేరున్న వారంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారిలా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి పేరులో కూడా రెడ్డి ఉందని, ఆయన కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన వారేనా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం జోగి రమేష్ మాట్లాడారు.
సోమిరెడ్డి కూడా వైఎస్సార్‌సీపీయేనా..?: జోగి రమేష్