అది కుల రాజకీయం కాదా: శ్రీకాంత్‌ రెడ్డి

వైఎస్సార్‌ కడప : రేషన్‌ కార్డులు లేని వారికి కూడా బియ్యం అందించడమే కాకుండా మూడు రోజుల్లో శాశ్వత కార్డులు అందిస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ రెండడుగులు ముందే ఉండే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. క్వారంటైన్‌ నుంచి డిశ్చార్జ్‌ అయినవారికి రూ.2 వేలు చెల్లించడం అభినందనీయమన్నారు. గురువారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందడం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఇష్టం లేదని విమర్శించారు. తల్లిదండ్రుల కమిటీలు 99శాతం ఇంగ్లీష్‌ మీడియాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. (‘లాక్‌’ మీకు.. దొడ్డిదారి మాకు..! )