వలస కార్మికుల ఖర్చులు భరిస్తాం : సోనియా

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలిచింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వారి స్వస్థలాలకు చేరేలా లాక్‌డౌన్‌ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం  సడలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు స్వస్థలాలకు వెళ్లేందుకు కనీస ప్రయాణ ఖర్చులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కూలీల ప్రయాణ ఖర్చులపై కేంద్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వక​పోవడంతో ప్రభుత్వ వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో వలస కూలీల ఇబ్బందులపై స్పందించిన కాంగ్రెస్‌ అధిష్టానం వారికి అండగా ఉంటామని ప్రకటించింది. వలసకార్మికుల ప్రయాణ ఖర్చు కాంగ్రెస్ పార్టీనే భరిస్తుందని, స్థానిక పార్టీ నేతలు వలస కార్మికులకు భరోసా నివ్వాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. (ఇడిసిపెడితే నేను పోత సారు..)