ఇక ఈ వాహనాలు ఖరీదే

న్యూఢిల్లీ:   "మేక్ ఇన్ ఇండియా" చొరవలో  భాగంగా  స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు వివిధ రకాల వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  కేంద్ర బడ్జెట్ 2020 - 21 ప్రసంగంలో శనివారం ప్రకటించారు. పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) పై కస్టమ్స్ సుంకాన్ని 40 శాతానికి పెంతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 25 శాతం మాత్రమే. 2020 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. దీంతో దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవిగా మారనున్నాయి. అయితే  ఈ మేరకు దేశీయ కంపెనీలకు కాస్త ఊరట లభించనుంది.