కలెక్టర్‌గా నియమితులైన పాఠశాల విద్యార్థిని

ముంబై : మహారాష్ట్రలోని ఓ జిల్లాలో పాఠశాల విద్యార్థిని కలెక్టర్‌గా నియమితులయ్యారు. అదేంటి స్కూల్‌ విద్యార్థి కలెక్టర్ అవ్వడం ఏంటని అనుకుంటున్నారా.. అసలు విషయమేంటంటే.. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సం. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఆ రోజున మహిళా దినోత్సవం నిర్వహించడం తెలిసిన విషయమే. అయితే మహారాష్ట మాత్రం ఇందుకు భిన్నంగా వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బుల్దానా జిల్లా కలెక్టర్‌ సుమన్‌ రావత్‌.. వారం రోజుల పాటు వివిధ పాఠశాలలోని ప్రతిభావంతులైన విద్యార్థినిలకు ఒక్క రోజు కలెక్టర్‌గా అవకాశం ఇస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న(సోమవారం) జిల్లా పరిషత్‌ పాఠశాల నుంచి పూనమ్‌ దేశ్‌ముఖ్‌ అనే విద్యార్థినిని ఒక రోజు కలెక్టర్‌గా ఎంపిక చేశారు.